తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్తలో వరుస పెట్టి కామెడీ ఎంటర్టైనర్ మూవీలలో హీరోగా నటిస్తూ వచ్చాడు. వాటితో అనేక విజయాలను అందుకొని తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం అల్లరి నరేష్ ఎక్కువ శాతం డిఫరెంట్ జోనర్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన బచ్చల మల్లి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను రేపు అనగా డిసెంబర్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు పెద్ద మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల షేర్ కలక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 1.4 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సీడెడ్ ఏరియాలో 60 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.2 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.2 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ లో కలుపుకొని ఈ మూవీ కి 80 లక్షల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమాకు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 5.5 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.5 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: