నందమూరి నటసింహం బాలకృష్ణ , బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వస్తున్న తాజా సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్యబాబు 109వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ తో పాటు కేవలం ప్రకటనలతోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.దీంతో ‘డాకు మహారాజ్’ నుంచి వచ్చే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.ఇదిలావుండగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు ఓ కొత్త సమస్య వచ్చి పడినట్లు తెలుస్తుంది.అదేమిటంటే డాకు మహారాజ్’ ఫస్ట్ కాపీ అయితే రెడీ అయిపోయిందట.అయినప్పటికీ మరింతగా కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రన్ టైం చాలా క్రిస్ప్ గా ఉండేలా చూసుకుంటున్నారట.

 తాజా సమాచారం ప్రకారం ‘డాకు మహారాజ్’ రన్ టైం 165 నిమిషాలు వచ్చిందట. అంటే 2 గంటల 45 నిమిషాలు . కథ డిమాండ్ మేరకు ఇంత నిడివి అవసరం అవుతుందని వినికిడి.అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభించారు . లండన్ లో ఈ చిత్రానికి పర్వాలేదు అనే రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి కానీ, నార్త్ అమెరికా లో మాత్రం ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదు.27 సినీ మార్క్ XD ప్రీమియర్ షోస్ ని షెడ్యూల్ చేసినప్పటికీ కూడా కేవలం రెండు వేల డాలర్స్ మాత్రమే వచ్చాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడానికి సాంకేతిక లోపం కారణమని, అందుకే ప్రస్తుతానికి షెడ్యూల్ చేసిన షోస్ అన్నిటిని రద్దు చేసి, మళ్ళీ ఫ్రెష్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తాము అంటూ ‘డాకు మహారాజ్’ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: