తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. ఈ సినిమా పేరు బరాబర్ ప్రేమిస్తా.. ఈ సినిమా టీజర్ ని సైతం డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది.. ఈ టీజర్ విషయానికి వస్తే. ఈ టీజర్ చూస్తూ ఉంటే రుద్రారం అరే ఊరిలో జరిగిన ఒక స్టోరీ అని ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న విషయానికి కొట్టుకుంటారని.. అలాంటి సమయంలోనే హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ మొదలవుతుందనే విధంగా చూపించారు.
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఎంట్రీ కూడా కాస్త విభిన్నంగానే చూపించారు.. ఇందులో హీరోయిన్ కూడా కాస్త విభిన్నమైన పాత్రలో చూపించారు చిత్ర బృందం.. హీరో హీరోయిన్ మధ్య జరిగే కెమిస్ట్రీ చూస్తూ ఉంటే టీజర్ లో హైలైట్ గా నిలుస్తోంది. ఇందులో పలువురు నటీనటులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని పంచ్ డైలాగులు కూడా అందరిని ఆకట్టుకోలేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు లవ్ యాక్షన్ రొమాంటిక్ అన్ని కూడా బరాబర్ ప్రేమిస్తా సినిమాలో ఉన్నట్టుగా ఈ టీజర్ లో అయితే కనిపిస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమాతో నైనా యాటిట్యూడ్ స్టార్ హిట్టు కొడతారేమో చూడాలి.