పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రజలకు సేవ చేస్తున్నారు .. మరో పక్క సమయం దొరికినప్పుడు హీరోగా తను చేయాల్సిన సినిమా షూటింగ్లో చేసేందుకు ట్రై చేస్తున్నారు .. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు ..ఇక పవర్ స్టార్ చేతిలో ఇప్పుడు నాలుగైదుకు పైగా సినిమాలు ఉన్నాయి .. ఇక అందులో ఓజీ కూడా ఒకటి .. ఈ సినిమా పై టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. సాహో సినిమా తర్వాత దర్శకుడు సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు ..


నిజానకి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు సరిగ్గా డేట్ లో కేటాయించలేకపోయాడు . ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు డేట్ ఇచ్చాడు పవన్ .. ఇక త్వరలోనే ఓజి మూవీకి సైతం డేట్స్ ఇవ్వనన్నట్లు తెలుస్తుంది .. ఈ క్రమంలోని తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజి మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట .. ఈ మూవీ చివరి షెడ్యూల్ థాయిలాండ్ లో షూటింగ్ జరగనుందని టాక్ .. అయితే ఈ షెడ్యూల్ ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఎవరికీ తెలియదు ..


ఇక ఓజి సినిమాలో ఎవరు ఊహించని పవర్ ఫుల్ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది .. ఇక ఆ పాటలో డీజే టిల్లు ఫేమ్ రాధిక అలియాస్ నేహా శెట్టి ఆడి పాడుతుందని అంటున్నారు .. అలాగే ఇందులో పవర్ స్టార్ తో కలిసి నిహశెట్టి  స్టెప్పులేయనుంది .. అయితే వీరిద్దరి కాంబోలోనే ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందా అనేది ఎవరికి తెలియదు .. ఇప్పుడు  ఓజి స్పెషల్ సాంగ్ పై మరింత హైప్‌  పెరిగింది . ఇక రాధికతో పవర్ స్టార్ స్పెషల్ సాంగ్ తో థియేటర్లో దద్దరిల్లి పోవాల్సిందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు .. ఇక మరి పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు .. దీంతో ఈ సినిమా కోసమే ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: