నైజాం ఏరియాలో గత కొన్నేళ్లలో పెద్ద సినిమాల కలెక్షన్లు భారీగా పెరిగాయి. 2016 సంవత్సరంలో ప్రముఖ థియేటర్లలో మూవీ టికెట్ రేటు 70 రూపాయలు కాగా ప్రస్తుతం అదే థియేటర్లలో టికెట్ రేటు 295 రూపాయలుగా ఉంది. గత కొన్నేళ్లలో టికెట్ రేట్లు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి ఇదే నిదర్శనమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నైజాంలో ఈ సినిమా ఇప్పటికే 82 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
 
రాబోయే రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప ది రూల్ మూవీ సాధిస్తున్న కలెక్షన్లను బ్రేక్ చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మరికొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. పుష్ప ది రూల్ మూవీ నైజాంలో సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు.
 
పుష్ప ది రూల్ మూవీ కలెక్షన్లు అల్లు అర్జున్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల మాత్రం అల్లు అర్జున్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడటం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ ఇతర భాషల్లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొడుతుండటం గమనార్హం.
 
అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: