2024 సంవత్సరం ప్రభాస్ కు బాహుబలి సినిమాలు తర్వాత మెమొరబుల్ ఇయర్ గా మారిపోయింది .. ఆయన కెరియర్ లోనే రెండు భారీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా విజయాలను అందుకున్నారు . వాటిలో ప్రధానంగా కల్కి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాడు .. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ , కమలహాసన్ , దీపికా పదుకునే కూడా నటించారు .. ఈ సినిమా సీక్వల్ కూడా ఉండబోతుందని ప్రకటించారు .. రీసెంట్గా ఈ సినిమా నిర్మాతలు ఓ ప్రెస్ మీట్ లో కల్కి మొదటి భాగం షూటింగ్లోనేే రెండో భాగం కు సంబంధించిన షూటింగ్ 20% కంప్లీట్ అయిందని ప్రకటించారు .. అలాగే రెండో భాగం వచ్చే ఏడాది ఎండింగ్లో మొదలైన 2026లో కల్కి 2 వచ్చే అవకాశం ఉంది .. కానీ ఆ అవకాశం లేకుండా ఇప్పుడు నటసింహం బాలయ్య సీన్లోకి రావటమే కాదు దర్శక నిర్మాతలకు ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రభాస్‌కు కూడా ఫోన్ చేసి నటసింహం రిక్వెస్ట్ చేశారట .. బేసిగ్గా ప్రభాస్ ఎవరి మాటను పక్కకు తీయలేడు .. అలాగే సీనియర్ స్టార్స్ చెప్తే వెంటనే దేనికైనా సై అనే అతను బాలయ్య ప్రపోజల్ ని వెల్కమ్ చేశారట. అదే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన వారసుడు మోక్షజ్ఞను లాంచ్ చేయాలనే ప్రపోజల్..
బాలయ్య పిలవడం టాలీవుడ్ లో దర్శక నిర్మాతలు రాకపోవటం అంటూ ఉండదు .. ఎప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన పనిలేదు .. కానీ తన కొడుకు మోక్షజ్ఞ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మేకింగ్ లో సింబ ఇస్ కమింగ్ మూవీ ని ప్లాన్ చేసిన మళ్లీ ఈ ప్రాజెక్టుకు కథపరంగా బ్రేకులు పడ్డాయని తెలుస్తుంది. వీటికి తోడు వెంకీ అట్లూరితో ఆదిత్య 369 సీక్వెల్ , ఆదిత్య 999 ను ప్లాన్ చేశాడు బాలయ్య .. ఇప్పుడు తన వారసుడు ఎంట్రీ ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ చేతులో పెడతాడా ? అదికాకుండా కొత్త కథతో తన వారసుడి ప్రాజెక్ట్ ప్లాన్ చేయిస్తున్నాడో తేలతేదు కాని , నాగ్ అశ్విన్ తో మోక్షజ్ఞ మూవీ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్టేనట. వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది . ఎలాగూ ప్రభాస్ ఫౌజీ , స్పిరిట్ మూవీలతోనే ఏడాదిన్నర వరకు బిజీ అయ్యే ఛాన్స్ఉంది. ఈలోపు మోక్షజ్ఞ మూవీ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ లో భాగంగా, దర్శకనిర్మాతలకే కాదు, రెబల్ స్టార్ కి కూడా బాలయ్య నుంచి కాల్ వెల్లినట్టు ప్రచారం జరుగుతోంది . ప్రభాస్ కూడా బాలయ్య మాటకు సై అనటంతో, సంక్రాంతికి మోక్షజ్ఞ తో కల్కీ ఫేం నాగ్ అశ్విన్ మూవీ ఎనౌన్స్ అవుతుందనే ప్రచారం పెరిగింది .