సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ SSMB 29 నుంచి ఒక అధికార అప్డేట్ లేకపోయినా .. మహేష్ , రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది .. త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ ను టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ మూవీ కోసం అదే రేంజ్ కాన్వాస్ ను రెడీ చేస్తున్నారు .. అందుకే అంతర్జాతీయ స్థాయిలో SSMB 29 ట్రెండ్స్ వినిపిస్తున్నాయి . త్రిబుల్ ఆర్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న రాజమౌళి .. తర్వాత వెంటనే మహేష్ మూవీ వర్క్ ను మొదలు పెట్టేసాడు ..


ప్రీ ప్రొడక్షన్ కోసం ఏకంగా మూడు ఏళ్లకు పైగా టైం తీసుకుని హాలీవుడ్ రేంజ్ కంటెంట్ ను సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే అధికారికంగా రాజమౌళి సైడ్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రాకపోయినా .. ఈ సినిమాకు సంబంధించిన ట్రెండ్స్ మాత్రం రెగ్యులర్గా వస్తున్నాయి . ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలోనూ రాజమౌళి ప్లానింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న న్యూస్ వైరల్ అవుతుంది .. మహేష్ కు జంటగా హాలీవుడ్ ని రూల్ చేస్తున్న ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా కలిసి నటించబోతున్నారని లేటెస్ట్ వైరల్ న్యూస్.  SSMB29 ను గ్లోబల్ మూవీ గా తీసుకురావాలని జక్కన్న సినిమాలో కీలక పాత్రల కోసం హాలీవుడ్ స్టార్స్ హెమ్స్‌వర్త్‌ను తీసుకువచ్చేందుకు ట్రై చేస్తున్నారట.


థార్‌, అవెంజర్స్‌ సీరిస్‌లతో ఇండియన్ ఆడియన్స్‌కు కూడా దగ్గరైన క్రిస్‌, మహేష్‌ మూవీలో నటిస్తే సినిమాకు వెస్ట్రన్‌ మార్కెట్‌లో హెల్ప్ అవుతుందని అంచనా వేస్తున్నారు.ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులు మాత్రమే కాదు ... టెక్నీషియన్స్ కోసం కూడా హాలీవుడ్ తలుపు తడుతున్నారు రాజమౌళి .. యాక్షన్ స్టంట్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్ విషయంలో ను హాలీవుడ్ టెక్నీషియన్స్ సాయం తీసుకుంటున్నారు .. 100 కోట్ల‌ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఏప్రియలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: