దేవర పాన్ ఇండియా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ లైన్ అప్ కూడా అంతే స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది .. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ తో వార్ 2 షూట్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ .. ఆ తర్వాత కూడా వరుస పరభాష దర్శకులతోనే సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు .. దేవర సినిమా తో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసస్ .. వరుసగా అదే స్థాయి ప్రాజెక్ట్స్ ను  లైన్లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ స్పై సిరీస్లో రాబోతున్న వార్ 2 లో నటిస్తున్నాడు ఎన్టీఆర్ .. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు .


వార్ 2  కంప్లీట్ అయిన వెంటనే ... ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమా షూటింగ్లో పాల్గొంటాడు .. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాా కోసం తన రూట్ ను మార్చి కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ .. ఈ సినిమా తర్వాత కూడా ఇతర భాషా దర్శకులతోనే ఎన్టీఆర్ సినిమాలు చేసే అవకాశం కనిపిస్తుంది .. ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు కోలీవుడ్ స్టార్ దర్శకులు అట్లీ , వెట్రీ మారన్ .. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.. డేట్లు కుదిరితే వీరీలో ఒకరితో నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది ..


ఇప్పటికిప్పుడు కాకపోయినా వీలైనంత త్వరగా ఈ కాంబో  ను సెట్స్ మీదకు  తీసుకు వెళ్లేందుకు ఎన్టీఆర్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ , దేవర సినిమాలు తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మార్కెట్ కూడా భారీగా పెరిగింది. అందుకే తర్వాత సినిమాలని అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడుు .. అందుకోసం తన బార్డర్స్ క్రాస్ చేసి మరి ఇతర భాష దర్శ‌కులను లైన్ లో పెడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: