కావ్య కళ్యాణ్ రామ్ ఈ చిన్నది ప్రతి ఒక్కరికి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా తోలుత తన కెరీర్ ప్రారంభించిన కావ్య ప్రస్తుతం హీరోయిన్ గా మారింది. స్నేహమంటే ఇదేరా, అడవి రాముడు, గంగోత్రి, ఠాగూర్, విజయేంద్ర వర్మ, బన్నీ, బాలు, పాండురంగడు, సుభాష్ చంద్రబోస్, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అనంతరం 2002లో మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.


సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ కావ్యకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం బలగం సినిమాలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది. బలగం సినిమా తర్వాత ఉస్తాద్ అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.


అందులో కావ్యను యాంకర్ మీరు ముసలి హీరోలతో నటించను అని అన్నారట కదా అది నిజమేనా అని ప్రశ్నించాడు. ఆ మాటకు కావ్య స్పందిస్తూ.... నేను అలా అనలేదు. ఇదంతా ట్విస్టింగ్ టర్నింగ్ అవుతోంది అని కావ్య సమాధానం ఇచ్చింది. అనంతరం అల్లు అర్జున్, బాలయ్య సినిమాలలో బాలనటిగా నటిస్తున్నప్పుడు వారు పెద్దయ్యాక మా పక్కన హీరోయిన్ గా నటించమని సరదాగా అడిగేవారని చెప్పింది.


అయితే ఆ సమయంలో నేను తెలియక ముసలి హీరోలతో నేను నటించను అని అన్నాను. నేను చిన్నప్పుడు అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ఎలాంటి తప్పులేదు. తెలిసి తెలియక అన్నాను. ఇప్పుడు ఛాన్స్ వస్తే తప్పకుండా వారితో నటిస్తానని కావ్య సమాధానం ఇచ్చింది. అనంతరం కొన్ని సినిమాల షూటింగ్స్ లలో ప్రస్తుతం బిజీగా ఉన్నానని కావ్య చెప్పారు. ఆ సినిమాలు ఏంటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: