ఇలా వరుస చిక్కుల్లో పడ్డ వేణు స్వామి కొన్ని రోజులు సైలెంట్ అయ్యాడు .. ఇప్పుడు మరోసారి అయిన పలు యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రత్యక్షమయ్యాడు. రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి వేణు స్వామి ఇంటర్వ్యూలు ఇచ్చారు .. ఇక అందులో అల్లు అర్జున్ అరెస్టు గురించి కూడా మాట్లాడాడు .. అంతేకాకుండా తనపై విమర్శలు చేసినందుకే టాలీవుడ్ చిక్కుల్లో పడిందని అన్నాడు .. అలాగే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. వేణు స్వామిని కెలికిన అప్పటి నుంచే ఎందుకు టాలీవుడ్ లో కలకలం మొదలైంది .. వచ్చే 2025 మార్చి నుంచి రాజకీయాల్లో కూడా పెను సంచలనాలు జరగబోతున్నాయి ..
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గింగరాలు తిరుగుతుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పినా .. ఇలాంటి నాలుగు పెద్ద సంఘటనను మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా ? ఓ పెద్ద స్టార్ హీరో కన్వెన్షన్ కూల్చివేయటం .. పెద్ద దర్శకుడు భారతదేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ చేయడం , పాన్ ఇండియా హీరోను జైల్లో వేయటం .. 70 ఏళ్ల చరిత్ర ఉన్న అగ్ర నటుడు ఇంట్లో గొడవలు .. ఇలా ఇవన్నీ ఎప్పుడైనా చూశారా ? నేనెప్పుడూ గతంలో ఆగస్టులోనే ఇదంతా చెప్పా .. ఇంకా చాలా జరుగుతాయి అని వేణు స్వామి చెప్పుకొచ్చాడు .. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ దుమారం రేపుతున్నాయి .. అదే విధంగా అల్లు అర్జున్ సీఎం అవుతాడని కూడా అతను కామెంట్ చేశాడు .