కోలీవుడ్ లో స్టార్ హీరోలేమో వారి సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోక కాస్త అటు ఇటుగా ఉంటే మీడియం రేంజ్ హీరోలేమో తమ రేంజ్ పెంచుకునే సక్సెస్ లు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. కోలీవుడ్ లో మొన్నటిదాకా ఒక సగటు హీరోగా మాత్రమే ఉన్న శివ కార్తికేయన్ అమరన్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. అమరన్ సినిమా 300 కోట్ల దాకా రాబట్టింది అంటే ఆ సినిమా తో శివ కార్తికేయన్ రేంజ్ ఏంటన్నది అర్ధమవుతుంది.

ఇక అమరన్ తర్వాత శివ కార్తికేయన్ సుధ కొంగర డైరెక్షన్ లో సినిమా చెస్తున్నాడు. ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు పూరణ నూరు టైటిల్ ఫిక్స్ చేశారు. ఐతే ఈ సినిమా ముందు సూర్య తో చేయాలని సుధ కొంగర అనుకుంది. కానీ ఎందుకో వారి మధ్య చర్చలు సఫలం కాలేదు. సుధ కొంగరతో సూర్య సూరరై పొట్రు సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నాడు సూర్య.

ఐతే ఆ సినిమానే హిందీలో రీమేక్ చేశాడు. హిందీలో తీసిన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా టైం లోనే సూర్యతో సుధ వ్యవహారం తేడా కొట్టిందని టాక్. అందుకే అసలైతే సూర్యతో చేయాలని అనుకున్నా ఈ సినిమాను శివ కార్తికేయన్ కి షిఫ్ట్ చేశారట. సూర్య చేయాలనుకున్న ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్, నజ్రియా కూడా నటించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వారు కూడా తప్పుకున్నారట. వారి ప్లేస్ లో జయం రవి, అధర్వ చేస్తున్నరు. ఈ సినిమాతోనే శ్రీలీల తమిళ పరిశ్రమకు పరిచయం అవుతుంది. శివ కార్తికేయన్ 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: