కమల్ హాసన్ తో తీసిన భారతీయుడు సీక్వెల్ గా ఇది వచ్చింది. ఐతే ఇండియన్ 2 సినిమా పై నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్ చేశారు. ఈ విషయంపై శంకర్ బాగా అప్సెట్ అయ్యారట. ఇండియన్ 2 పై నెటిజన్లు ఇచ్చిన రివ్యూ కి షాక్ అయ్యారట. సినిమను మరీ చీల్చి చెండాడేశారని తెలిసిందే. ఐతే ఆ టైం లోనే ఇండియన్ 3 సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి ఫిక్స్ చేశారని అన్నారు.
కానీ శంకర్ ఇండియన్ 3 కూడా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో గేం ఛేంజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శంకర్ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ ఇండియన్ 3 ని కచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా అని. ఆ సినిమా థియేటర్ లో రిలీజ్ చేస్తామని అన్నారు. గేం ఛేంజర్ సినిమాలో చరణ్, కియరా అద్వాని నటించారు. సినిమాతో కియరా కూడా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. మరి తన మీద వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానం చెప్పేలా గేం ఛేంజర్, ఇండియన్ 3 తో శంకర్ సూపర్ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. శంకర్ సినిమాలో ఉండాల్సిన గ్రాండియర్ అంతా కూడా రాబోతున్న ఇండియన్ 3, గేం ఛేంజర్ లో ఉన్నాయని తెలుస్తుంది.