వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించినటువంటి తాజా యానిమేటెడ్ చిత్రం ముఫాసా ది లయన్.. ఈ చిత్రాన్ని 2019లో విడుదలైనటువంటి ది లయన్ కింగ్ చిత్రానికి ఫ్రీక్వెల్  అన్నట్లుగా తెలుస్తోంది.. ముఫాసా పాత్రకు సైతం మహేష్ బాబు డబ్బింగ్ కూడా చెప్పారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి బాగా క్రేజ్ ఏర్పడినది. అలాగే హీరో నాని కూడా ది లయన్ కింగ్ కి డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రానికి పోటీగా అల్లరి నరేష్ నటించిన బచ్చలపల్లి, కన్నడలో ఉపేంద్ర నటించిన యు ఐ, తమిళంలో 2 సినిమా విడుదలైనప్పటికీ  ముఫాసా ది లయన్ చిత్రానికి అంతే క్రేజీ సంపాదించుకుంది. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుందో చూద్దాం.



స్టోరీ విషయానికి వస్తే..ది లయన్ కింగ్ స్టోరీతో మొదలవ్వగా..ముఫాసా స్టోరీ ఏమిటంటే సింబ తండ్రి ముఫాసాతో ప్రారంభమవుతుందట. అసలు ఈ ముఫాసా ఎవరు ?.. ఎక్కడి నుంచి వచ్చారు?.. తమ తల్లిదండ్రులకు ఎందుకు దూరం అయ్యారు. అనాధగా వేరే జాతి సింహాల దగ్గర పెరిగి ఒక రాజుగా ఎలా ఎదిగారు?.. అలాంటి సమయంలోనే బలవంతుడైన కిషోర్ ను ఎలా ఎదిరించారు?..ముఫాసా కి టాకా ఎలా సహాయపడ్డారు?.. చివరికి వీరందరూ కూడా మిలేలీకి ఎలా చేరుకున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ ముఫాసా చిత్రమే నట.


ఈ చిత్రం మొత్తం లైవ్ యానిమేషన్ చిత్రంగా ఉంటుంది. సహజంగా కనిపించే యానిమేషన్ క్వాలిటీస్ సైతం ఈ సినిమా చూసిన ఆడియన్స్ ని బాగా ఎంజాయ్ ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రానికి కూడా డబ్బింగ్ ఆర్టిస్టు చాలా కీలకమని చెప్పవచ్చట. మహేష్ బాబు డబ్బింగ్ లో గుంటూరు కారం సినిమా యాస బాగా వినిపిస్తోంది.ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పిన మహేష్ బాబు వాయిస్ బాగా ఆకట్టుకుందట.అందువల్లే క్యారెక్టర్స్ స్ట్రగుల్స్ పైన ఆడియన్స్ ని కూడా బాగా ఫోన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.


కమెడియన్ బ్రహ్మానందం పుంబాకు డబ్బింగ్ చెప్పిన బాగా సెట్ అయ్యిందట. ఆలీ కూడా టియాన్ కు డబ్బింగ్ చెప్పడం కూడా బాగా సింక్ అయినట్లు తెలుపుతున్నారు ఆడియన్స్. శేషు వాయిస్ పిట్ట గొంతుకు చెప్పారట.ఇందులో కామెడీ కూడా బాగుందట.. అలాగే టాకా క్యారెక్టర్ కు సత్యదేవ్ ఇలా కొన్ని పాత్రలలోని కొంతమంది నటీనటులు తెలిపారు.


డైలాగ్స్ బాగానే పేరిన ఇందులోని పాటల సాహిత్యం తెలుగు వాళ్లకి సింక్ అవ్వలేదట.. బ్రహ్మానందం, మహేష్, ఆలీ వంటి పాత్రలు చెప్పిన డైలాగ్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయట. టెక్నికల్ పరంగా ఈ సినిమాకి పనిచేసిన వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనట. అండర్ వాటర్ ఎపిసోడ్ చాలా అద్భుతంగా కవర్ చేశారని తెలుపుతున్నారు. వాల్ట్ డిస్నీ ఈ మధ్యకాలంలో ఒక్కో సినిమాలతో పిల్లల్ని పెద్దలని అర్థం చేసుకునే రీతిలో తెరకెక్కిస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక డైరెక్టర్ బ్యారి జెన్కిన్స్ అతని టీం ని సైతం అభినందించాలి. ఈ సినిమా మంచి నీతి కథ కోసం తెరకెక్కించారు.. థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా నట.. ఈ చిత్రాన్ని త్రీడీ లేదా 4DX లో చూస్తే మరింత ఆకట్టుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: