ఈ సినిమాకు సంబంధించి కథ, కథనం కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ప్రధానంగా మధ్యతరగతి ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండటం ఈ సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పొషించిందని చెప్పవచ్చు. మీనాక్షి చౌదరి సైతం వయస్సుకు మించిన పాత్రలో కనిపించడంతో పాటు ఆ పాత్రతో అంచనాలకు మించి మెప్పించారని చెప్పాలి.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్లలో లక్కీ భాస్కర్ ఒకటి కాగా ఓటీటీలో సైతం ఈ సినిమా హిట్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో ఎన్నో పెద్ద సినిమాలను క్రాస్ చేసి ఈ సినిమా టాప్ లో నిలవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. లక్కీ భాస్కర్ కు లక్ కూడా అన్ని విధాలుగా కలిసొచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.
లక్కీ భాస్కర్ సినిమాకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను ఈ సినిమా అంచనాలను మించి మెప్పించింది. వెంకీ అట్లూరి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ తో వెంకీ అట్లూరి పారితోషికం పెరిగిందని తెలుస్తోంది. వెంకీ అట్లూరి మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది.