ప్రశాంత్ వర్మ ఈ ఏడాది ఇండస్ట్రీ మొత్తం ప్రకంపనలను సృష్టించిన పేరు..ఒకే ఒక్క  సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఈ డైరెక్టర్ హనుమాన్ సినిమాతో స్టార్ హీరోలకే వణుకు పుట్టించారు..మరి ఇంతకీ2024 లో ప్రశాంత్ వర్మ కు ఏ విధంగా కలిసి వచ్చింది.ఆయన స్టార్డం ఏ మేరకు పెరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అంటే అందరికీ హనుమాన్ మూవీ నే గుర్తుకొస్తుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డి, కల్కి, అ! వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ప్రశాంత్ వరర్మ దర్శకత్వం వహించిన ఈ మూడు సినిమాల్లో జాంబిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈయనకి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ఒకప్పటి నటుడు వినయ్ రాయ్ విలన్ గా..వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటించిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి పోటీగా జనవరి 12న విడుదలైంది.. 

సినిమా విడుదలకు ముందు ఎన్నో ఇబ్బందులు పడింది. అంతేకాదు ఈ సినిమా విడుదల కాకుండా కొంతమంది అడ్డుకున్నారని, కానీ ఎవరి ఎవరికి తలవంచకుండా సినిమాని ఎట్టకేలకు రిలీజ్ చేశామని ఈ సినిమా రిలీజ్ కి ముందు పాల్గొన్న ప్రమోషన్స్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ చెప్పుకొచ్చారు. అయితే స్టార్ హీరో సినిమాకి పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ మహేష్ బాబు సినిమాకి వణుకు పుట్టించింది. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైన నాగార్జున నా సామిరంగా, మహేష్ బాబు గుంటూరు కారం,వెంకటేష్ సైంధవ్ వంటి అగ్ర హీరోల సినిమాకు పోటీగా విడుదలై సంక్రాంతికి విడుదలైన సినిమాలు అన్నింటిలోకెల్లా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అత్యంత ఎక్కువ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద కింగ్ గా మారింది.

 అలా హనుమాన్ మూవీతో హిట్టు కొట్టిన ప్రశాంత్ వర్మ ఈ ఏడాది తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అత్యంత భారీ స్టార్డం సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మకి చాలామంది స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ ని తీసుకున్నారు బాలకృష్ణ. అలాగే రణ్ వీర్ సింగ్ తో కూడా ఓ సినిమాని చేయబోతున్నట్టు టాక్ వినిపించింది. కానీ ఇది ఇంకా అఫీషియల్ కాలేదు. ఇక హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు.జైహనుమాన్  మూవీలో హనుమంతుడి పాత్రలో కాంతారా ఫేమ్ కన్నడ నటుడు డైరెక్టర్ అనేటువంటి రిషబ్ శెట్టిని కూడా తీసుకున్నారు. అలా ఈ ఏడాది ప్రశాంత్ వర్మ కెరీర్ లోనే ఒక మర్చిపోని సంవత్సరంగా మిగిలిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: