టాలీవుడ్ లో మరో ఏడాది ముగిసిపోయింది. 2024 యేడాది కాల గర్భం లో కలిసి పోయింది. చిరంజీవి - బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ వీళ్లంతా టాప్ స్టార్స్. ఈ ఏడాది వీళ్ళు నటించిన సినిమాలు సున్నా ఒకరు కాదు .. ఇద్దరు కాదు ఏకంగా 12 మంది హీరోలు ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా ఈ ఏడాదిని ముగించేశారు. ప్రభాస్ - మహేష్ - ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ ఏడాది తమ సినిమా లు రిలీజ్ చేశారు. చిరంజీవి - బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు గత ఏడాది సినిమాలతో సందడి చేసిన ఈ ఏడాది వాళ్ళ సినిమాలు రాలేదు. వచ్చే ఏడాది బాలయ్య నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి. ఒకటి డాకు మహారాజ్ .. రెండోది అఖండ 2. పవన్ కళ్యాణ్ నుంచి కూడా వచ్చే యేడాది రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇక రామ్ చరణ్ కు భారీ గ్యాప్ తప్పలేదు. నితిన్ - నాగచైతన్య - సాయి దుర్గ తేజ్ నుంచి కూడా ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు.
ఇక అఖిల్ - నాగశౌర్య - అడవి శేష్ కూడా 2024 ఏడాది మిస్ అయిపోయారు. వీరంతా వరుస ప్లాపుల వల్ల గ్యాప్ తీసుకోగా అడవి శేషు మాత్రం తనకు వచ్చిన క్రేజీ ను కాపాడుకునే క్రమంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - పంజా వైష్ణవ తేజ్ లాంటి హీరోలు కూడా ఈ ఏడాది బాక్సాఫీస్ మిస్ అయ్యారు. ఇలా 2024 బాక్సాఫీస్ ను ఏకంగా 12 మంది టాలీవుడ్ హీరోలు మిస్ అయ్యారు. జనాలు మాత్రం యేడాది కి ఒక్క సినిమా చేయకపోతే ఎందుకు అని ఈ హీరోల విషయంలో తిట్టి పోసుకుంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేయడాది వీళ్లంతా యాక్టివ్ కాబోతున్నారు. మరి 2025లో అయినా వీరు తమ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచిగా సందడి చేస్తారని ఆశిద్దాం.