అయితే మళ్లీ చాలాకాలం తర్వాత ఉపేంద్ర అభిమానుల కోరిక మేరకు డైరెక్టర్గా ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. అదే UI. ఈ సినిమా ఈ రోజున పాన్ ఇండియా లేవల్లో అన్ని భాషలలో చాలా గ్రాండ్గా రిలీజ్ అయ్యింది.. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన వారితో పాటుగా పలువు సినీ సెలబ్రిటీల ప్రసాద ల్యాబ్లో స్పెషల్ షో చూసినవారు కూడా ఈ సినిమాని మెచ్చుకోవడం జరిగిందట. సినిమా చూసిన ఆడియన్స్ ,అభిమానులు, నేటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారట. ఉపేంద్ర సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లారని తెలియజేస్తున్నారు.
ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం కూడా 2047 వ సంవత్సరంలో భారతదేశానికి చెందినటువంటి ప్రజలు కట్టుకోవడానికి బట్టలు లేక , నివసించడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక, నీరు లేక కేవలం బంగారం, డబ్బు వంటివి మాత్రమే ఉంటాయట. ఆ సమయంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని ఉపేంద్ర తెరకెక్కించారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఇప్పటివరకు ఏ డైరెక్టర్ ఇలా ఆలోచించినట్లుగా కూడా కనిపించలేదట. ఇదే హీరో ఉపేంద్ర స్పెషల్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని.. చూసిన వారందరూ కూడా మాటల్లేవ్ అన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండమంటూ చాలామంది నెటిజెన్స్ తెలియజేస్తున్నారు.
Ui సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే..
1).2024 కల్కి ఎపిసోడ్ కీలకంగా మారిందని.
2). హీరోయిన్ సైకో లవ్ ట్రాక్ కూడా హైలెట్ గా ఉందని.
3). ఇందులోని సాంగ్స్ పిక్షరైజేషన్.
4). ఎలక్షన్స్ లీడర్స్ ఫైట్
5). డైరెక్టర్ ఉపేంద్ర కల్కి మధ్య ఆర్గ్యుమెంట్ సన్నివేశాలు.
6). సినిమాలోని క్యారెక్టర్ లను చూపిస్తూ డైరెక్టర్ ఆర్గ్ చేయడం సినీ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరు చేయలేదు.. ఇలాంటి సన్నివేశాలు కూడా మరెవరు చేయలేరు అన్నట్టుగా UI సినిమా ఉన్నదట. ఇలా చేయాలనే ఆలోచనలో కూడా చాలామంది భయపడతారని నేటిజన్స్ తెలుపుతున్నారు. ఇందులోని ప్రతి పాత్ర కూడా కీలకమని తెలియజేస్తున్నారు.