ఈ ఏడాది ఎంతోమంది దర్శకులకు మంచి లైఫ్ ఇచ్చింది.కొంతమందికి ఫ్లాఫ్ లను కూడా ఇచ్చింది.అయితే ఈ ఏడాది రాజమౌళి లాంటి దిగ్గజ డైరెక్టర్ కి ధీటుగా మరో డైరెక్టర్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదిగారు. ఇక ఆయన ఎవరయ్యా అంటే నాగ్ అశ్విన్.. అశ్వినీ దత్ అల్లుడు నాగ్ అశ్విన్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఇప్పటికే
ఎవడే సుబ్రహ్మణ్యం, పిట్ట కథలు, మహానటి  వంటి సినిమాలు తెరకెక్కించారు. మహానటి సినిమాతో తన సత్తా ఏంటో చాటి చెప్పిన నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాతో ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు.. భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కలేదు.ఈ సినిమా విడుదలైన రోజే ఎంతోమందిని ఆకట్టుకుంది.


అలా కల్కి సినిమా చూసిన చాలామంది ఒక్కసారి కాదు ఐదారు సార్లు థియేటర్లకు వెళ్లి మరీ చూశారు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం కూడా ఉంది. అలా ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్,  విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటాని,మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్, శోభన, ఫరీయా అబ్దుల్లా, అన్నా బెన్ వంటి ఎంతోమంది నటినటులు చేశారు.అలాగే రాంగోపాల్ వర్మ, రాజమౌళి,కెవి అనుదీప్ వంటి డైరెక్టర్లు కూడా గెస్ట్ రోల్ లో నటించారు. అయితే అలాంటి పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ కి ఈ సినిమా విడుదలయ్యాక భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది.

అంతేకాదు వెయ్యి కోట్ల డైరెక్టర్లలో ఒకరిగా  నాగ్ అశ్విన్ పేరు తెచ్చుకున్నారు. అలా రాజమౌళి వంటి స్టార్ దర్శకుడికి ధీటైన దర్శకుడిగా నాగ్ అశ్విన్ ఎదిగారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అలా 600 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి 2898AD మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ నీ అందుకుంది.అలా టాలీవుడ్ కి మరొక రాజమౌళి దొరికేసారని ఈయన సినిమా చూసిన ఎంతోమంది సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు

మరింత సమాచారం తెలుసుకోండి: