ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా చిన్ని అనే పాట రిలీజ్ అవుతోంది. ఈ నెల 23వ తేదీన ఈ సెకండ్ సింగిల్ విడుదల కానుందని సమాచారం అందుతోంది. చిన్ని అనే పదంతో ఈ సింగిల్ రిలీజ్ కానుండగా ఈ పాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం గమనార్హం.
బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం అందుతోంది. డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ సైతం హీరోయిన్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
డాకు మహారాజ్ ట్రైలర్ విడుదలైతే మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. డాకు మహారాజ్ సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్ గా ఉంటాయని సమాచారం అందుతోంది. దర్శకుడు బాబీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య లుక్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.