మీనాక్షి చౌదరి.. ఈ ఏడాది చేతి నిండా సినిమాలు ఉన్న హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది లో ఆమె కు లక్కీ భాస్కర్ వంటి మంచి సినిమా చేసింది. ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ భార్య గా మీనాక్షి చౌదరి నటన కి మంచి మార్కులే పడ్డాయి..  అలాగే తమిళంలో ది గోట్ మూవీ లో నటించింది. అలా రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే గుంటూరు కారం సినిమా లో కూడా నటించినప్పటికీ ఈ సినిమా లో ఆమె పాత్ర కి అంత ప్రాధాన్యత లేదు. అలా మీనాక్షి చౌదరికి ఈ ఇయర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.అలాగే నెక్స్ట్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ తో కూడా రాబోతుంది. ఇదిలా ఉంటే  రెండు సినిమాలు హిట్టవ్వడంతో మీనాక్షి చౌదరి కి పొగరు తలకెక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. 

అయితే ఈ టాక్ రావడానికి ప్రధాన కారణం మీనాక్షి చౌదరి నిర్మాతలను ఇబ్బంది పెట్టడమేనట. ఇక విషయం లోకి వెళ్తే.. మీనాక్షి చౌదరి తన సినిమాలో నటించే సమయం లో తన సొంత ఇంట్లో ఉంటూనే రోజుకు 18,000 ఇవ్వాలని నిర్మాతలను డిమాండ్ చేస్తుందట. అయితే ముంబై నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చే హీరోయిన్ లకి నిర్మాతలు రెంటు డబ్బులు కడతారు. 

కానీ మీనాక్షి చౌదరి కి హైదరాబాదు లో సొంత ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ లోనే ఉంటుంది. కానీ తన సొంత ఫ్లాట్ లో ఉన్నా కూడా తనకి రోజుకు 18 వేల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అంటూ నిర్మాతల్ని ఇబ్బంది పెడుతుందట. ఇక ఈ ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ జనాలు ఒక్క హిట్టుకే అంత తల పొగరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేకాదు ఇది ఇలాగే కొనసాగితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడం ఖాయం అంటూ మాట్లాడుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: