రీసెంట్ గానే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు . అయితే సమంత రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా..? అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్ . త్వరలోనే ఆ విషయం కూడా వినబోతున్నాం అంటూ తాజాగానే హింట్ ఇచ్చేసింది సమంత . అయితే సమంత మయోసైటిస్ కన్నా ముందే ఒక తెలుగు హీరోతో సినిమాకి కమిట్ అయిందట . కానీ మయోసైటీస్ తర్వాత ఆమె ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆ సినిమాను క్యాన్సల్ చేసుకుందట. ఆ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేసిందట .
అయితే అఫీషియల్ గా లీగల్ అగ్రిమెంట్ మాత్రం క్యాన్సిల్ చేయలేకపోయిందట. ఇప్పుడు సమంత హెల్త్ బాగున్న కారణంగా ఆ హీరో సమంతతో సినిమా చేయాలి అంటూ బాగా మొండిగా వాదిస్తున్నాడట . అయితే సమంతకి ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదట . ఈ క్రమంలోనే ఆ హీరోకి అదే విధంగా ఆన్సర్ చెప్పగా.. ఆయన లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అంటూ బెదిరిస్తున్నారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఈ విషయంలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సమంత ఫ్యాన్స్ మాత్రం సదరు హీరో పై మండిపడుతున్నారు . సమంత హెల్త్ గురించి ఆలోచించరా..? అంటూ ఫైర్ అవుతున్నారు..!