డీజే టిల్లు స్క్వేర్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాడు సిద్దు జొన్నలగడ్డ. విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయింది. క్లాసిక్ టైటిల్ ఆ ఒక్కటి అడక్కు వాడుకుని అల్లరి నరేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. బచ్చలయల్లి కూడా గొప్పగా లేదన్నారు. శర్వానంద్ మనమే జనాలకు గుర్తులేదు. సుధీర్ బాబు హరోం హర, మానాన్న సూపర్ హీరో చిత్రాలు .. రెండూ విడుదలకు ముందు ఆసక్తిని పెంచాయి. రిలీజ్ తర్వాత ఉసూరనిపించాయి. రాంకు డబుల్ ఇస్మార్ట్ షాక్ ఇచ్చింది. కార్తికేయ భజే వాయు వేగం ప్లాప్.
నాని సరిపోదా శనివారంతో హిట్టు అందుకున్నాడు. లక్కీ భాస్కర్ విజయం సాధించాయి నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో డిజాస్టర్. శ్రీసింహ, సత్య ‘మత్తువదలరా 2′ తో మరోసారి మ్యాజిక్ చేశారు. ’35 చిన్న కథ కాదు’ మంచి సినిమాగా ప్రశంసలు అందుకుంది. కమిటీ కుర్రాళ్ళు సినిమాకి మంచి మార్కులు పడ్డాయ్. నార్నే నితిన్ బడ్డీ కామెడీ ‘ఆయ్’ థియేటర్స్ కి జనాల్ని రప్పించగలిగింది. అల్లు శిరీష్ బడ్డీ, ప్రియదర్శి డార్లింగ్, సుహాస్ చేసిన అంబాజీ పేట, ప్రసన్నవదనం, జనక అయితే గనక.. సినిమాలూ ఆడియన్స్ ని రప్పించలేకపోయాయి.