గేమ్ ఛేంజర్ సినిమాకు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్ ఉంటాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతాయని దిల్ రాజు కామెంట్లు చేశారు. సంక్రాంతి సినిమాలలో మూడు సినిమాలకు నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కాగా గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ది రూల్ మూవీ హవా తగ్గిందనే చెప్పాలి. ఈరోజు ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కావడం పుష్ప ది రూల్ జోరుకు బ్రేకులు వేసింది. వాస్తవానికి గేమ్ ఛేంజర్ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.
అయితే సంక్రాంతి పండుగ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తే మరింత బెనిఫిట్ కలుగుతుందని భావించి గేమ్ ఛేంజర్ ను సంక్రాంతికి వాయిదా వేయడం జరిగింది. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వేరే లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.