ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ పెళ్లిళ్లు చేసుకునేసి అభిమానులకి భారీ షాక్ ఇస్తున్నారు . ఎంతలా అంటే అసలు ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అప్పుడే  పెళ్లి చేసుకోదులే అంటూ ఫ్యాన్స్ నెగ్లెట్ చేసిన మూమెంట్లోనే  అఫీషియల్ గా ఆ పెళ్లికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తూ ఉండడం ఫాన్స్ కి సైతం బిగ్  షాకింగ్ గా ఉంది . మరి ముఖ్యంగా కీర్తి సురేష్ పెళ్లి అభిమానులకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.  ఆఫ్ కోర్స్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడం అందరికీ హ్యాపీగానే ఉంది . కానీ కెరియర్ పీక్స్ లో ఉండగా పైగా ఇప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోబోతూ ఉండగా పెళ్లి చేసుకోవడం జనాల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.


కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే . అయితే పెళ్లి తర్వాత కూడా సినిమా ప్రమోషన్స్ లో బాగా పాల్గొంటుంది . తాజాగా బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో మెడలో తాళి వేసుకొని మరీ ప్రమోషన్స్ నిర్వహించింది. దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు మారు మ్రోగిపోతుంది . అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ బ్యూటీ మరెవరో కాదు శృతిహాసన్ .



ఎస్ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . శృతిహాసన్ పెళ్లి వార్త గతంలో చాలా సార్లు ట్రెండ్ అయ్యాయి. వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆమె బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దదే. చాలామందితో డేటింగ్ చేసింది . ఆ తర్వాత అది అలాగే ఫ్లాప్ అయిపోయింది . అయితే ఇప్పుడు మాత్రం శృతిహాసన్ తండ్రి చెప్పిన సంబంధాన్ని చేసుకుంటుందట. త్వరలోనే శృతిహాసన్ ఎంగేజ్మెంట్ చేసుకొని అఫీషియల్ గా తన పెళ్లి విషయాని బయట పెట్టబోతుందట. ప్రజెంట్ ఈ న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్గా మారింది. శృతిహాసన్ - ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో  నటించిన విషయం అందరికీ తెలిసిందే . అంతే కాదు సలార్ 2 లో కూడా నటిస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: