కొన్ని కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంట్రీ ఇప్పిస్తున్నారు . ఇప్పటికే అల్లు అర్హ.. శాకుంతలం సినిమా ద్వారా తన సినీ రంగ ప్రవేశం చేసింది. సితార కూడా రేపో మాపో అన్న రేంజ్ లోనే ప్లాన్ చేస్తుంది . అయితే ఇప్పుడు అందరి కళ్ళు ఎన్టీఆర్ కొడుకుల పై పడ్డాయి . ఎన్టీఆర్ కొడుకులు కూడా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీలు చేస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం అస్సలు తన కొడుకుల ఇండస్ట్రీలోకి రావడం ఇష్టమే లేదట .
వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వృత్తిలో సెటిల్ అయితే చూడాలి అని అనుకుంటున్నారట . వాళ్లకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు ఆపనే ఆ పను అంటూ కూడా చెప్పుకొస్తున్నారట . అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కొడుకులను చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా చూపించడానికి పలువురు డైరెక్టర్స్ బాగా ప్లాన్ చేశారట . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ససేమీరా ఒప్పుకోలేదట . వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలి ..వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అంటూ చెప్పుకొస్తున్నారట . ఓ డైరెక్టర్ మాత్రం పదే పదే జూనియర్ ఎన్టీఆర్ కొడుకులనును చైల్డ్ ఆర్టిస్ట్ గా చూపించడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారట . అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మొహమాటం లేకుండా ముఖాన్నే ఆ విషయం గురించి మాట్లాడే పాటైతే ఇంటికి రావద్దు అంటూ ఫేస్ మీద చెప్పేసాడట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!