సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భీమ్స్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. భీమ్స్ ఖాతాలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు శిరీష్ నిర్మాత ఈ సినిమకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒకింత భారీ స్థాయిలోనే జరిగిందని సమాచారం అందుతోంది.
మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ లో మీనాక్షి చౌదరి లుక్స్ బాగున్నాయి. వెంకటేశ్ మీనాక్షి చౌదరి జోడీ బాగుందని చెప్పవచ్చు.
మీనాక్షి చౌదరి ఒకవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకు వెంకటేశ్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వెంకటేశ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంక్రాంతి పండుగ విజేతగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.