బాలీవుడ్ లో ఎంతోమంది ముద్దుగుమ్మలు వెండితెర పైకి వస్తున్నారు .. అలా వచ్చిన వారిలో హర్నాజ్ కౌర్ సంధూ కూడా ఒకరు .. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ విశ్వసుందరి పోటీలలో 21 సంవత్సరాలకు హర్నాజ్ కౌర్ సంధూ విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది .. భారతదేశపు తరుపున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతీగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ .. ఇక హర్నాజ్ కౌర్ సంధూ 2000 సంవత్సరంలో చండీగఢ్లో జన్మించింది .. 17 ఏళ్ల వయసులోనే మోడలింగ్ కెరీర్ ను మొదలు పెట్టింది .. అదే ఏడాది మిస్ చండీగఢ్ టైటిల్‌ని కూడా సొంతం చేస్తుంది. ఆ తర్వాత 2018 లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా 2018 టైటిల్‌ను గెలుచుకుంది ..
ఇక అందాల పోటీలో పాల్గొనే సమయంలో ఈ చిన్నది బరువు ఎంతో పెరిగిపోయింది .. ఆ సమయంలో ఆమెపై చాలామంది విమర్శలు కూడా చేశారు .. బాడీ షేమింగ్ తో పాటు ఎన్నో అవమానాలు పడ్డానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది .. ఆ సయయంలో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్ని తర్వాత 2021 లో మిస్ యూనివర్స్ గా గెలిచింది .. నేను నన్ను నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది . ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సన్నజాజిలా మారి తన అందంతో కనువిందు చేస్తుంది .. అలాగే ఈ ముద్దుగుమ్మ పంజాబీలో పలు సినిమాల్లో కూడా నటించింది .. ఇక ఇప్పుడు బాగి 4 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది .. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .