సినిమా లవర్స్ కి శుభవార్త. ఈ వారం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 22 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఓటీటీలకు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. నచ్చిన సినిమా లేక వెబ్‌సిరీస్ నచ్చిన సమయంలో నచ్చిన భాషలో నచ్చినట్టు చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్ తేదీతో పాటు ఓటీటీ రిలీజ్ కూడా ఉంటోంది. అయితే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఆ 22 సినిమాలు ఏంటో చూద్ధం.. అమెజాన్  ప్రైమ్ లో ముర అనే మలయాళ మూవీ, స్వైప్ క్రైమ్ అనే హిందీ సిరీస్, బీస్ట్ గేమ్స్ అనే ఇంగ్లీష్ సిరీస్, మదనోల్సవం అనే మలయాళ సినిమా విడుదల కానున్నాయి. ఇక ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో  జీబ్రా అనే తెలుగు సినిమా, నిరంగళ్ మూండ్రు అనే తమిళ మూవీ స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.
అలాగే హాట్‌స్టార్ లో వాట్ ఇఫ్? సీజన్ 3 అనే ఇంగ్లీష్ సిరీస్ మరో రెండు రోజుల్లో ఓటీటీ లోకి సందడి చేయనుంది. నెట్‪‌ఫ్లిక్స్ లో ఫెర్రీ 2 అనే డచ్ సినిమా, సిక్స్ ట్రిపుల్ ఎయిట్ అనే ఇంగ్లీష్ మూవీ, యూనివర్ క్సో డబీజ్ అనే ఇంగ్లీష్ సిరీస్, ఉజుమాకీ అనే జపనీస్ సిరీస్, యోయో హనీసింగ్ అనే ఫేమస్ హిందీ మూవీ, ఉంజులో అనే ఇంగ్లీష్ సినిమా కానున్నాయి. స్పై x ఫ్యామిలీ కోడ్ అనే వైట్ - హిందీ సినిమా డిసెంబర్ 21న ఓటీటీలో రిలీజ్ కానుంది. దిలాన్ 1983 అనే ఇండోనేసియన్ సినిమా, ద డ్రాగన్ ప్రిన్స్ అనే ఇంగ్లీష్ సిరీస్, ద డ్రాగన్ ప్రిన్స్ అనే ఇంగ్లీష్ సిరీస్ అండ్ వర్జిన్ రివర్ సీజన్ 6 అనే ఇంగ్లీష్ సిరీస్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ద ఫోర్జ్ అనే ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ 22 న స్ట్రీమింగ్ కానుంది.
సోనీ లివ్ లో క్యూబికల్స్ సీజన్ 4 అనే తెలుగు డబ్బింగ్ సిరీస్, స్టాగ్స్ అనే ఇంగ్లీష్ సిరీస్ సందడి చేయనున్నాయి. ఇక సన్ నెక్స్ట్ ఓటీటీలో కడకన్ అనే మలయాళ మూవీ విడుదల కానుంది. జియో సినిమాలో ఆజ్ పిర్ జీనే కీ తమన్నా హై అనే భోజ్‌పురి సినిమా, మూన్ వాక్ అనే హిందీ సిరీస్, పియా పరదేశియా అనే మరాఠీ మూవీ, లెయిడ్ అనే ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. థెల్మా అనే ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. లయన్స్ గేట్ ప్లేలో బాయ్ కిల్స్ వరల్డ్ అనే ఇంగ్లీష్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. బుక్ మై షోలో సెంటిమెంటాల్ అనే బెంగాలీ మూవీ రిలీజ్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే థియేటర్లలో పుష్ప 2 మూవీ హవా నడుస్తూనే ఉంది. మరోవైపు అల్లరి నరేశ్ బచ్చలమల్లి, విజయ్ సేతుపతి విడుదల 2, ఉపేంద్ర యూఐ, హాలీవుడ్ మూవీ ముఫాసా థియేటర్లలోకి వచ్చేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: