కల్కి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ది రాజా సాబ్. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ది రాజా సాబ్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఇది వరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్.రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ది రాజా సాబ్’ కూడా ఒకటి. భారీ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బ్యూటీఫుల్ లవ్ అండ్ హారర్ జానర్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ లుక్ వేరే లెవెల్‌ ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది.ఈ సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టీజర్  క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.అలాగే రాజాసాబ్ వాయిదా పడుతుందని కూడా వార్తలు వచ్చాయి.తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.అందులో రాజాసాబ్ షూటింగ్ కంటిన్యూగా రాత్రి, పగలు షెడ్యూల్స్ తో జరుగుతుంది. ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ అయిపొయింది.అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.ఇటీవల టీజర్ క్రిస్మస్ కి, న్యూఇయర్ కి వస్తుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అలాంటి రూమర్స్ నమ్మకండి. ఎలాంటి అప్డేట్స్ అయినా మేము అధికారికంగా ఇస్తాము.టీజర్ త్వరలోనే వస్తుంది.మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు.న్యూ ఇయర్ కి టీజర్ వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ప్రకటనతో నిరాశలో మునిగిపోయారు. దీంతో ప్రభాస్ సినిమా రిలీజ్ పై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: