సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలలో నటించే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. ప్రయోగాలు చేసినా ఒక లిమిట్ దాటి ప్రయోగాలు చేయడానికి చాలామంది హీరోలు ఇష్టపడరు. ఈ విషయంలో హీరో ఉపేంద్ర మాత్రం ఇతర హీరోలకు పూర్తి భిన్నమని చెప్పవచ్చు. యూఐ సినిమాలో ఫస్ట్ డిస్క్లైమర్ " మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే థియేటర్ నుండి బయటకు వెళ్లండి" అని వేశారు.
 
యూఐ సినిమా ఎలా ఉండబోతుందో ఈ డిస్క్లైమర్ ద్వారా చెప్పకనే చెప్పేశారని చెప్పవచ్చు. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ తో హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా విభిన్నమైన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.

 
ఉపేంద్ర సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మరింత ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఉపేంద్ర వన్ మ్యాన్ షో అని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. డిఫరెంట్ టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ వీకెండ్ కు మంచి సినిమాను థియేటర్ లో చూడాలని భావించే ప్రేక్షకులు ఈ సినిమపై కచ్చితంగా దృష్టి పెట్టవచ్చు. యూఐ సినిమాతో ఉపేంద్ర మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది.
 
సినిమా ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ను పరీక్షించే సినిమా కాగా  టాక్ సైతం బాగుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు వరమైంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకు బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లోనే యూఐ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం పక్కా అని చెప్పవచ్చు. ఉపేంద్ర లుక్స్ కు సైతం ఫిదా అవుతున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: