సుకుమార్.. చాలా సరదాగా ఉంటారు . తన పని తాను చేసుకునిపోతూ ఉంటాడు . సుకుమార్ సీరియస్ అయితే మాత్రం అది వేరే లెవెల్ లోనే ఉంటుంది . ప్రెసెంట్ అలాంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . ఎస్ సుకుమార్ అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారట . అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కారణంగానే అరెస్టయ్యాడు అంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట . అల్లు అర్జున్ అరెస్టు అయ్యి రిలీజ్ అయ్యి  ఇంటికి రాగానే సుకుమార్ అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళి మరి అల్లు అర్జున్ ని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు .


ఆ విజువల్స్ కూడా మనం చూసాం . అయితే ఇప్పుడు పుష్ప2 సినిమా విషయంలో సుకుమార్ చాలా చాలా పక్కాగా ప్లాన్ చేసి మరి ముందుకు వెళ్తున్నారట. పుష్ప3 సినిమాలో ఘాటుగా కొన్ని డైలాగ్స్ కూడా సపరేట్గా రాయించబోతున్నారట . అయితే ఇలాంటి మూమెంట్లోనే పుష్ప3లో ఓ డైలాగు ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  మొదటి భాగంలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అనే డైలాగ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. రెండవ భాగంలో పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ అద్భుతంగా మార్చేశాడు సుకుమార్ .



ఇక పుష్ప3 విషయానికి వచ్చేసరికి ఆ డైలాగ్ ను మరింత ఘాటుగా ట్రెండ్ అయ్యేలా చూస్తున్నారట . బీహారి గుండాలు బన్నీని చంపడం కోసం ఇంటికి వస్తే తనని చంపుతున్న నేపథ్యంలో పుష్ప రాజ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ వచ్చే విధంగా రాశారట." పుష్పని వేసయ్యాలంటే ప్లాన్ ఒక్కటే ఉంటే సరిపోదు అబ్బా.. గుండె ధైర్యం కూడా ఉండాలి ..ఎవడు పడితే వాడు వచ్చి పోడిస్తే పోవడానికి పుష్ప ఏమన్నా ఫ్లవర్ అనుకుంటివా? కాదు ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్" అంటూ పుష్పరాజ్ తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్తాడట . ఈ డైలాగ్ కి సంబంధించిన న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియా వైరల్ గా మారింది . ఈ డైలాగ్ థియేటర్లో వినపడితే థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే అంటున్నారు అభిమానులు . అంతేకాదు అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించిన కూసింత ఘాటు డైలాగ్స్ కూడా ఈ సినిమాలో యాడ్ చేయబోతున్నారట..!

మరింత సమాచారం తెలుసుకోండి: