గ్లోబల్ స్టార్   రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' సినిమాను పూర్తి చేసిన ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అండ్ RC 16 సినిమాలు చేస్తున్న విషయం తెలిసందే. ఈ రెండు సినిమాల తరువాత చరణ్ సుకుమార్ తో సినిమా చేయనున్నాడు. ఈ భారీ ప్రాజెక్టుకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. 2025 చివర్లో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేంటంటే.. రంగస్థలం సినిమా కోసం రూరల్ బ్యాక్డ్రాప్ ను తీసుకున్న సుకుమార్ RC 17 కోసం స్టైలీష్ సెటప్ చేస్తున్నాడట. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూడని సరికొత్త పాయింట్ తో ఈ సినిమా రానుందని టాక్. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అంతే కాకుండా ఈ మూవీలో కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండనుందట. ముఖ్యంగా ఈ మూవీని యూత్‌ను అట్రాక్ట్ చేసే విధంగా తెరకెక్కించాలని సుకుమార్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ కోసం సుకుమార్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఇప్పుడు మరోసారి వీరి కాంబో సెట్ అయ్యిందంటే అలాంటి ఒక మాస్ ఎంటర్‌టైనర్‌నే ప్రేక్షకులు కోరుకున్నారు. కానీ సుకుమార్ మాత్రం వెరైటీగా రామ్ చరణ్‌ను మోడర్న్ లుక్‌లో చూపించాలని ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా వుండగాశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ఎన్నో అడ్డంకుల తర్వాత ఫైనల్‌ గా సంక్రాంతికి విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: