ఇక ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ విలన్‌గానూ అలరించారు. 1966లో చిలకా గోరింకా చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేశారు. అవేకళ్లు చిత్రంలో ప్రతినాయకుడిగానూ నిరూపించుకున్నారు. 1977,1984 సంవత్సరాల్లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. విజయనగర సామ్రాజ్య క్షత్రియ రాజ వంశానికి చెందిన కృష్ణంరాజు, దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగానూ సేవలందించారు.
ఈ నేపథ్యంలో ఆయన భార్య శ్యామలాదేవి కి ఆయనకి మధ్య ఉన్న చాలా ఏజ్ గ్యాప్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారిద్దరికీ 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని తెలిపారు. అలాగే కృష్ణం రాజుకి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టమని.. ఆయన ఫుడ్ ని చాలా ఇష్టంగా తినేవారని చెప్పుకొచ్చారు. కృష్ణం రాజు తండ్రి కూడా తనని మెచ్చుకునేవారని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.