యూట్యూబ్ స్టార్ గా షణ్ముఖ్ జశ్వంత్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. షణ్ముఖ్ షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు పొందాడు. తాను నటించిన సూర్య, సాఫ్ట్ వేర్ డెవలపర్ లాంటి వెబ్ సిరీస్ కి ఒక సిపారేట్ ఫాన్స్ బేస్ ఉంది. తన నటనతో షణ్ముఖ్ జశ్వంత్ ప్రేక్షకులకు మరింత దగ్గరై తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సబ్ స్క్రయిబర్స్ కలిగిన యూట్యూబర్ గా రికార్డ్ క్రియోట్ చేశాడు. ఆ మధ్య కాలంలోనే దీప్తి సునైనాతో లవ్ ట్రాక్ కూడా నడిచింది.  షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక ఆమెతో బ్రేక్ అప్ కూడా అయిందని అందరికీ తెలుసు.
అయితే ఇంత గొప్ప ఇమేజ్ క్రియేట్ చేసుకున్న షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా లీల వినోదం ఓటీటీ సినిమాలో నటించాడు. సినిమా రిలీజ్ కి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నా జర్నీ అంతా మొదట వైజాగ్‌లోనే ప్రారంభమైంది. ఆ సమయంలో నా కెరీర్‌ ఎటు పోతుందో తెలియని అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు హైదరబాద్‌కు వచ్చి కొన్ని కవర్‌ సాంగ్స్‌, షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్‌ సిరీస్‌లు చేసుకున్నాను. మంచిగానే సక్సెస్‌ అయ్యాను. కానీ, ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్‌ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా.. ఇందులోకి నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలీకి అండగా ఉండాలని ప్రతి కుమారుడు అనుకుంటాడు. అయితే, నా వల్లే కుటుంబానికి వారికి చెడ్డపేరు వచ్చింది. అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నా వల్లే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అమవాస్య చూసినోడు తప్పకుండా పౌర్ణమి చూస్తాడు. నా జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు లీల వినోదం ప్రాజెక్ట్‌ వచ్చింది. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ ఉంటారు. కానీ, ఒక్కసారి కింద పడినప్పుడు మనతో ఎవరుంటారో వాళ్లే నిజమైన మిత్రులు. నా అనుభవంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాను.' అని యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ చెప్పుకొచ్చారు.
సినిమా లో షణ్ముఖ్ కి జోడీగా అనఘ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూసే సినిమా. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి. కానీ టైమ్ పాస్ కోసం చూసే సినిమాలు తగ్గిపోయాయి. అయితే లీల వినోదం సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో కామెడీ, కథా నేపథ్యం బాగుందని, బలహీనతల విషయానికి వస్తే.. హీరోయిన్‌ ట్రాక్‌, ప్రేమ గురించి చెప్పే స్పెషల్‌ సీక్వెన్స్‌ బాలేవని టాక్ వినిపిస్తుంది. పేరుకు తగ్గట్టే వినోదం పంచుతుందని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: