దాంతోనే ఎన్నడూ లేనంతగా వర్మ ఇపుడు అల్లు అర్జున్ ని డిఫెండ్ చేస్తూ అక్కరలేని ప్రేమను కురిపిస్తున్నట్టు కనబడుతోంది. ఇక ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్టై, ఒక రోజు జైల్లో ఉండి విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను తన నివాసంలో చాలా మంది ప్రముఖులు పరామర్శించారు కూడా. అయితే ఈ విషయంపై ఆఫ్ ద రికార్డ్ తప్ప.. మైకుల ముందు, బహిరంగంగానూ, ఆన్ లైన్ వేదికగానూ అల్లు అర్జున్ తరుపున మాట్లాడుతున్న ఒకే ఒక వ్యక్తి ఆర్జీవీ. ఇది ఆర్జీవీ వ్యూహంలో భాగమే అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అవును, కూటమి ఆర్జీవీ విషయంలో ఉచ్చు బిగుస్తున్నవేళ ఇపుడు ఆర్జీవీ అల్లు అర్జున్ పై ఎనలేని ప్రేమ కురిపించడంతో జనసేన పవన్ కళ్యాణ్ కాస్త దిగి, ఆర్జీవీని క్షమించేస్తాడని ప్లాన్ వేస్తున్నట్టు అనుమానిస్తున్నారు.
ఆ సంగతి పక్కనబెడితే... ఆర్జీవీ... ఈసారి ఏకంగా తన ఫెవరెట్ యాక్ట్రెస్ శ్రీదేవిని ఉదాహరణగా చెబుతూ మరోసారి ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా క్షణ క్షణం సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ విషాద ఘటనను లేవనెత్తారు. అప్పట్లో ‘క్షణ క్షణం’ షూటింగ్ లో శ్రీదేవి చూడటానికి వచ్చిన లక్షలాది మంది జనంలో ముగ్గురు చనిపోయారట. అందుకు తెలంగాణ పోలీసులు ఇప్పుడు శ్రీదేవిని అరెస్ట్ చేయడానికి స్వర్గానికి వెళ్తారా? అంటూ ఆర్జీవీ ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా.. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ చంచల్ గూడ జైల్ లో ఒక రాత్రి గడిపిన సంగతి తెలిసిందే.