నటీనటులు: ఉపేంద్ర, రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: హెచ్‌సీ. వేణు
మ్యూజిక్: అజనీష్ లోకనాథ్
నిర్మాతలు: జీ మన్మోహన్, శ్రీకాంత్ కేపీ
దర్శకత్వం: ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర చాలా యేళ్ల తర్వాత నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా UI. ఉప్పీ గత సినిమా టైటిల్స్ చూస్తేనే డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు యూఐ సినిమా పై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.
స్టోరీ & విశ్లేషణ :
పగలు - రాత్రి సత్య ( ఉపేంద్ర ) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ యూఐ సినిమా కథ నడుస్తుంది. ఉపేంద్ర తన పాత వింటేజ్ సినిమాల స్టైల్లోనే సెటైరికల్‌గా ఈ కథను నడిపాడు. దర్శకుడిగా ఉపేంద్ర వన్ మ్యాన్ మ్యాజిక్ షో ఇది. హీరోయిన్‌తో సైకో లవ్ ట్రాక్ కేక పెట్టిస్తుంది. ఒక రా .. ఉపేంద్ర , ఏ సినిమాలను గుర్తు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే అంతకు మించే ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్‌తో తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే విజువల్ ట్రీట్ ఉంటుంది. సినిమాలో పాటలు కూడా సెటైరికల్‌గా ఉండడం మరో ట్విస్ట్. ప్రస్తుతం ట్రెండ్‌కు అనుగుణంగానే పాటలు ఉంటాయి. ఓ ఎపిసోడ్‌లో ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ దర్శకుడు తెరకెక్కించని .. ఇంకా చెప్పాలంటే ఏ దర్శకుడికి రాని ఆలోచనతో ఈ సినిమా తెరకెక్కించాడు. ఇది థియేటర్లోనే చూడాలి.. చెప్పేది కాదంతే.
దర్శకుడిగాను ఉపేంద్ర తనదైన మార్క్ టేకింగ్‌తో సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాడు. ఇక రెండు డిఫరెంట్ క్లైమాక్స్‌లు పుట్టాలన్న ఆలోచన వచ్చినందుకే ఉపేంద్రకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మేకింగ్‌లోనూ ఆ క్వాలిటీ. పడిన కష్టం తెరమీద కనిపించింది. సినిమా కథ అంతా ఉపేంద్ర చుట్టూనే తిరుగుతుంది. ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లం తెర మీద బలంగా చూపించడంలో దర్శకుడిగా.. ఇటు నటుడిగాను ఉపేంద్ర సక్సెస్ అయ్యాడు. సినిమాలో చెప్పుకోవడానికి ఒక్కటేమిటి చాలా హైలెట్స్ ఉన్నాయి.
ఈ సినిమా ఎందుకు ? చూడాలని అనుకుంటే మైండ్ బ్లోయింగ్, మెస్మరైజ్ అయ్యే సీన్లు ఉన్నాయి. అందులో కొన్ని సీన్లు ఇవి..
1 ) కల్కి ఎపిసోడ్
2 ) హీరోయిన్ సైకో లవ్ ట్రాక్
3 ) పెద్దది, చిన్నది సాంగ్ పిక్చరైజేషన్
4 )టెంపుల్ ఫైట్
5 )ఎలక్షన్ లీడర్స్ ఫైట్
6 ) దర్శకుడు ఉపేంద్ర, కల్కి మధ్య ఆర్గ్యుమెంట్ సీన్లు
7 ) ఉపేంద్ర పాత్ర
8 ) సినిమాలో క్యారెక్టర్‌తో డైరెక్టర్ ఆర్గ్యు చేయడం సినీ చరిత్రలోనే ఎవ్వరూ చేయలేదు.. చేయబోరు కూడా అన్నట్టుగా ఉంది. ఇలా చేయాలన్న ఊహలోనే భయపడతారు.
మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుంచి బయటికి వెళ్ళండి అంటూ మొదట్లోనే వేసిన డిస్‌క్లైమర్‌తోనే ప్రేక్షకులకు ఫ్యీజులు ఎగిరేలా చేశాడు. రియల్ టైం ప్రాబ్లంతో హార్ట్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తో సినిమా అదరగొట్టి పడేసింది. ఇలాంటి కథలు ఉన్న సినిమాలు రావు.. వచ్చినా ప్రేక్షకులకు కనెక్ట్ కావు. ఈ విషయంలో యూఐ ను బాగా సక్సెస్ చేశాడు ఉపేంద్ర. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ సినిమా చూడాల్సిందే.
ఫైనల్ పంచ్ : ఉపేంద్ర మ్యాజిక్ మ్యాజిక్ యూఐ
UI రేటింగ్ : 3 / 5