* రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో సినిమా
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శక ధీరులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది ఒక సినిమాతో సక్సెస్ అయితే... మరి కొంతమంది దర్శకులు... ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా రాణించడం లేదు. కొత్త కొత్త కథలతో వచ్చినా కూడా సక్సెస్ కావడం లేదు. కానీ... జక్కన్న... మాత్రం ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్ని సక్సెస్ చేసుకున్నాడు. వందకు వందశాతం సక్సెస్ రేట్ తో రాజమౌళి దూసుకు వెళ్తున్నాడు.
అయితే అలాంటి ఎస్ఎస్ రాజమౌళి... 2024 సంవత్సరంలో ఎలాంటి మెరుపులు లేకుండానే... ఈ సంవత్సరాన్ని ముగించేశాడు. ఈ సంవత్సరంలో షూటింగ్ అయినా ప్రారంభించలేదు రాజమౌళి. కానీ... ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమా కోసం... దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది అంట. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను చేయబోతున్నట్లు చెబుతున్నారు.
దీంతో రాజమౌళి అలాగే మహేష్ బాబు సినిమా పై... అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుందని... అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది భాగవతాన్ని తీస్తారని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అని అంటున్నారు.ఈ సినిమా మొత్తం జపాన్లో షూటింగ్ జరగబోతున్నట్లు చెబుతున్నారు.
ఏదేమైనాప్పటికీ... ఈ సినిమా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కొత్త సంవత్సరంలోనే... ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారు. రాజమౌళి సినిమా కోసం ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ కూడా మహేష్ బాబు మెయింటెన్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా 2022లో... ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు రాజమౌళి. ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకుంది. అలాంటి ఆస్కార్ సినిమా తర్వాత మహేష్ బాబుతో... అంతకుమించి సినిమా తీయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట.