చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తమిళ సినీ ఇండస్ట్రీ చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటుంది. నిన్నటి రోజున ఈ వేడుకలు చాలా గ్రాండ్గా జరిగాయి. ప్రతి ఏడాది  ఫిల్మ్ రివ్యూ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేడుకను సైతం చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా హాజరవుతూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా అమరన్ చిత్రంలో  రేబెక వర్గీస్ పాత్రకు సైతం సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అలాగే విజయ్ సేతుపతి మహారాజా చిత్రానికి గాని ఉత్తమ నటుడుగా అవార్డును సైతం అందుకోవడం జరిగింది.



ఈ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. చెన్నైలో కథ 22 ఏళ్లుగా ఈ వేడుకలు జరుగుతూనే ఉన్నాయట. తమిళంలో విడుదలైన చిత్రాలే కాకుండా ప్రపంచ భాషలలో విడుదలైన ఎన్నో చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందట. ఫిల్మ్ ఫెస్టివల్  12వ తేదీన ప్రారంభమై ఈనెల 19వ తేదీకి ముగిసింది.. దాదాపుగా ఈ ఫెస్టివల్ లో  180 చిత్రాలు ప్రదర్శించారట.. ఇందులో ఉత్తమ నటిగా అమరన్ చిత్రానికి సాయి పల్లవని ఎంపిక చేయడం జరిగింది.. అలాగే ఉత్తమ నటుడుగా మహారాజా చిత్రానికి విజయసేతుపతి అందుకున్నారు.



అవార్డు అందుకున్న సాయి పల్లవి మాట్లాడితే 22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు అందుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు రిలీజ్ అయ్యాయి అందులో తనని ఎంపిక చేయడం మరింత ఆనందంగా ఉందని.. చాలా ఎమోషనల్ గా మాట్లాడింది ముకుంద కుటుంబ సభ్యులు ఆయన భార్య వల్లే తనకు ఈ అవార్డు వచ్చిందని.. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఒక జవాన్ కథ సినిమానే అమరన్. రాజ్ కుమార్ పెరియాస్వామి డైరెక్టర్ వంటి వారివల్లే ఇలాంటి కథలు మనకి దొరుకుతున్నాయి అంటూ తెలిపింది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: