యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ... కొరటాల శివమూవీ కి దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్మూవీ లో బైర అనే పాత్రలో నటించాడు.ఈ సినిమాలో బైర కు పసుర అనే కుమారుడు ఉంటాడు. ఇకపోతే పసుర కి ఒక లవర్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో బైర కుమారుడి లవర్ పేరు చంద్రకళ.

చంద్రకళ ఈ మూవీ లో చాలా తక్కువ సన్నివేశాలలో ఉన్నా ఈ మూవీ లో బైర కుమారుడి లవర్ పాత్రలో నటించిన చంద్రకళ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. దేవర సినిమాలో చంద్రకళ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ అసలు పేరు లతా విశ్వనాథ్ రెడ్డి. ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు కదా మీరు కూడా ఎదుర్కొన్నారా అనే ప్రశ్న ఈ బ్యూటీ కి ఎదురయింది. దీనికి ఈమె సమాధానం చెబుతూ ... మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు కదా ..? మీరు ఏమైనా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నారా అని లతా రెడ్డి తిరిగి ప్రశ్నించింది. తమకు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని సమస్య లేదని యాంకర్ సమాధానం ఇచ్చింది.

మీకే కాస్టింగ్ కౌచ్ సమస్య లేనప్పుడు మాకెందుకు ఉంటుంది' అని ఈ బ్యూటీ యాంకర్ కు అదిరిపోయే రేంజ్ సమాధానం ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే. ప్రతి ఇండస్ట్రీ లో కూడా అమ్మాయిలు , అబ్బాయిలు ఉంటారు. వారి మధ్య అట్రాక్షన్ రావడం కూడా చాలా కామన్. వాళ్లు అలా అడగడంలో తప్పు లేదు. అలాగని మనం నో చెప్పడంలో కూడా ఏ మాత్రం తప్పేం లేదని అది కామన్' అంటూ ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lvr