టాలీవుడ్‌ను ఏలుతున్న నాలుగు కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి .. మెగాస్టార్ చిరంజీవి ఎవరిపై ఆధారపడకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా మారి. ఆ తర్వాత తన కుటుంబం నుంచి ఒక్కొక్కరిని హీరోలుగా తయారు చేశారు .. ఇక మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 10 మందికి పైగా హీరోలు వచ్చారు .. ఇక వారందరినీ పక్కన పెడితే మెగా వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ .. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ కు ఫస్ట్ లో విమర్శలు కూడా వచ్చాయి .. ఆయన వాటిని పట్టించుకోకుండా చిరంజీవి కొడుకు చరణ్ దగ్గర్నుంచి చరణ్ తండ్రి చిరంజీవి అనే వరకు ఎదిగాడు.


త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారాడు .. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ దగ్గర్నుంచి  గేమ్ ఛెంజర్ సినిమాతో వస్తున్నాడు .  సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెర్కెక్కిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు .. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కీయరా అద్వానీ , అంజలి హీరోయిన్లుగా నటించారు .. అలాగే ఎస్ జె సూర్య , శ్రీకాంత్ , జయరామ్‌ వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజ‌ర్‌ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అని అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఇప్పటికే గేమ్ ఛెంజర్ రిలీజ్ ఐ చాలాకాలం అయి ఉండేది .. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛెంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు మేకర్స్ .. అలాగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు .. ఇక డిసెంబర్ 21న అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.. ఇక దీనికోసం చిత్ర యూనిట్ మొత్తం ఎంతో ఆస్తిక‌ వెయిట్ చేస్తున్నట్లు రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.


అదేంటి అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే భారతదేశంలో ఉండదా అంటే .. ఎందుకు ఉండదు జనవరి 4న ఇండియాలో ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమండ్రి లేదా విశాఖపట్నంలో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు తెలుస్తుంది.. అంతేకాకుండా మెగా అభిమానులు ఎగిరి గంతేసే న్యూస్ ఏమిటంటే.. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు సమాచారం. బాబాయ్ కోసం అబ్బాయి ఎక్కడికైనా వెళ్తాడు అలాగే అబ్బాయి కోసం బాబాయ్ కూడా ఏదైనా చేస్తాడు.. ఇక రామ్ చరణ్ కోసం తన పనులను కొద్దిగా పక్కనపెట్టి.   తన టైం కొంత ఇచ్చినట్లు తెలుస్తుంది.. అయితే బాబాయ్ అబ్బాయి కరోటం ఇది కొత్త కాదు కానీ ఈసారి కలయిక కొంచెం కొత్తగా ఉండబోతుంది.. పవన్ సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ ఈవెంట్లో చేసిన రచ్చ ఇంతవరకు ఎవరూ మర్చిపోలేదు .. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో అల్లు అర్జున్  వివాదమే ఎక్కువగా వినిపిస్తుంది.


ఇక మొన్నటి వరకు మెగా- అల్లు విభేదాలు పోయి ఇప్పుడు బన్నీ కేసు గురించి హాట్ టాపిక్ గా నడుస్తుంది .. ఈ కేసు విషయంలో వెనకనుంచి ఎంత సపోర్టుగా నిలబడిన బన్నీని పవన్ ఎక్కడా కలవలేదు .. ఆయన ఎందుకు కలవలేదు అనేది పెద్ద మిస్టరీ.. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ దీని గురించి ఏమైనా సీరియస్ అవుతాడా ? ప్రజల క్షేమం కోరుకునే బాధ్యత గల పదవులో ఉన్న సమయంలో కచ్చితంగా చనిపోయిన రేవతి కుటుంబం గురించి మాట్లాడాలి.. అది ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జరుగుతుందా ? లేక అనేది తెలియాల్సి ఉంది .. ఇక దీని గురించే అందరూ గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: