సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్లకు అద్భుతమైన క్రేజ్ ఉంటూ ఉంటుంది. వారు నటించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడం , వారు తమ అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండడంతో కొంత మంది కి స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. అలా స్టార్ హీరో స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో ఈమె కమర్షియల్ సినిమాలలో నటిస్తూ తన అందాలతో ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ జిగ్రా అనే సినిమాలో నటించింది. లేడీ ఓరియంటెడ్ కథతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఆలియామూవీ లో తన నటనతో ఆలియా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 18 కోట్ల వరకు పారితోషకాన్ని పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు 550 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇలా ఆలియా భట్ ఒక్కో సినిమాకు 18 కోట్ల పారితోషకాన్ని తీసుకుంటూ , 550 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: