మెగాస్టార్ చిరంజీవి నట‌సింహం బాలకృష్ణకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఇద్దరు దాదాపు 40 సంవత్సరాలగా బాక్సాఫీస్ వద్ద ఒకరు సినిమాలతో ఒకరు ఢి అంటే ఢి అనే విధంగా పోటీ పడుతున్నారు .. ఇక 2023 సంక్రాంతి లో కూడా ఈ ఇద్దరు బాక్సాఫీస్ బరిలో దిగి విజయం సాధించారు .. ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే .. చిత్ర పరిశ్రమలో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎంతో మంచి స్నేహితులు .  ఈ క్రమంలోనే బాలకృష్ణ నటించిన ఓ సినిమా షూటింగ్ దాదాపు చిరంజీవి ఇంట్లోనే తెరకెక్కించారు.


బాలకృష్ణ హీరోగా నటించిన ఓ సినిమా షూటింగ్ దాదాపు చిరంజీవికి సంబంధించిన ఓ గెస్ట్ హౌస్ లోనే జరిగింది .. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగి దాదాపు 35 సంవత్సరాలు కావస్తుంది .. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు నారీ నారీ నడుమ మురారి.. బాలకృష్ణ , ఏ కోదండ రామారెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా.. హీరోగా బాలకృష్ణకు 50వ సినిమా.. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.. 1988లో యువచిత్ర బ్యానర్ లో తెరకెక్కిన జానకి రాముడు సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ , శివశక్తి దత్తతో కలిసి నారి నారి నడుమ మురారి సినిమాకి కథ చర్చలు ప్రారంభించారు .. అలాగే నిర్మాత మురారి.. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ లుగా భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ తో పాటు సీత అనుకున్నారు.. ఇక శాంతి ప్రియ సీతా ప్లేస్ లో శోభన, నిరోషాలను హీరోయిన్స్‌గా తీసుకున్నారు .


ఇక నారీ నారీ నడుమ మురారి హీరోగా బాలకృష్ణ కెరియర్ లోనే ఎంతో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది .. ఇక ఈ సినిమా బాలయ్యను పూర్తి క్లాసు లుక్ లో చూపించింది.. అలాగే ఈ సినిమాలో బాలయ్యతో ఒక్క ఫైట్ కూడా లేకుండా చూపించడం విశేషం .. 1989లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.. అలాగే ఈ సినిమాని చెన్నైలోని వెల్లిచ్చెరి అనే ప్రాంతంలో చిరంజీవి గెస్ట్ హౌస్ లో తెరకెక్కించారు.. ఇక దాని పేరు హనీ హౌస్ దాని పక్కనే ఉన్న రెండు ఎకరాల స్థలం కూడా చిరంజీవిది. ఆ ప్లేస్ లోనే ఈ నారీ నారీ నడుమ మురారి కి సంబంధించిన 90% షూటింగ్ పూర్తి చేయటం విశేషం.. ఈ సినిమాలో అత్త మామూలు ఇంటి పక్కనే ఉన్న పాకలోనే హీరో ఉంటూ అత్త‌ను టీజ్‌ చేయడం అనేది ఈ మూవీలో ఉన్న ప్రత్యేకత.

మరింత సమాచారం తెలుసుకోండి: