అలాగే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెర్కక్కిన మర్యాద రామన్న సినిమాతో స్టార్‌డం పెంచుకునే ప్రయత్నం చేశాడు .. అయితే మర్యాద రామన్న తర్వాత వచ్చిన సినిమాలన్నీ సునీలకు భారీ షాక్ ఇచ్చాయి .. దాంతో తర్వాత హీరో గా కాకుండా హీరోల అన్నయ్య పాత్రలు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు సునీల్ .. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 సినిమాలో కూడా సునీల్ ఎంతో అద్భుతంగా నటించాడు .. ఈ క్రమంలోనే స్టార్ నటుడు సునీల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది ..
స్టార్ కమెడియన్ గా ఉన్న సమయంలో సునీల్ షూటింగ్ సమయంలో అందరితో ఎంతో క్లోజ్ గా ఉండేవాడట .. అలాగే ఫన్నీగా జోకులు కూడా వేసేవాడట .. ఆ క్రమంలోనే హీరోయిన్ త్రిష పై షూటింగ్ సమయంలో ఫన్నీ జోకులు వేశాడట సునీల్ .. ఇక దాంతో సీరియస్ అయిన త్రిష .. సునీల్ చెంప మీద లాగిపెట్టి కొట్టిందట .. ఇక అందరూ చూస్తుండగానే అతన్ని ఆమె కొట్టిందట. అయితే ఈ విషయాన్ని సునీల్ లైట్ తీసుకున్నారని అంటారు. ప్రస్తుతం ఇదే వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .