టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయం సాధించిన ఈమె ఈ సినిమాలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులు ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగులో వచ్చింది. ఆ తర్వాత ఈమె ఎన్నో టాలీవుడ్ సినిమాలలో నటించి అందులో చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి ఎదిగింది.

ఇకపోతే ఈమె తెలుగు తో పాటు కొన్ని హిందీ , తమిళ్ సినిమాలలో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన వల్ల పూజా హెగ్డే కి రెండు ఫ్లాపులు దక్కినట్లు తెలుస్తోంది .అసలు విషయం లోకి వెళితే ... రష్మిక మందన ఓ రెండు సినిమాలను రిజెక్ట్ చేయగా ఆ సినిమాలలో పూజా హెగ్డే నటించగా ఆ రెండు సినిమాల్లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయట. కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే , రామ్ చరణ్ కు జోడిగా నటించింది. ఇకపోతే ఈ మూవీలో పూజ హెగ్డే పాత్ర కోసం ఈ మూవీ బృందం మొదట రష్మికను సంప్రదించారట.

కానీ ఈమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక పూజా హెగ్డేను ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో తీసుకోగా ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యిందట. తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో కూడా మొదట హీరోయిన్ అవకాశం రష్మికకి వచ్చిందట. కానీ ఈమె ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట. ఇలా రష్మిక రిజెక్ట్ చేసిన ఈ రెండు మూవీల ద్వారా పూజ హెగ్డేకు ప్లాప్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: