సమంత నాగచైతన్య విడిపోయినప్పటి నుండి వీరి మీద ఎన్ని వార్తలు మీడియాలో వినిపించాయో చెప్పనక్కర్లేదు.. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కొన్ని రూమర్లుగా కొన్ని నిజాలుగా మిగిలి పోయాయి. కానీ ఇప్పటివరకు వాటిపై ఈ జంట క్లారిటీ ఇచ్చింది లేదు.అయితే అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన సమంతని ఇంట్లో నాగచైతన్య ఎలా టార్చర్ పెట్టేవారో ఓ ఇంటర్వ్యూవలో సమంత చెప్పింది.మరి ఇంతకీ సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోని ఇంటికి వచ్చాక నాగచైతన్య ఎలా ప్రవర్తించేవాడో సమంత మాటల్లో ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. నేను ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే  ఇంటికి వెళ్లాక మా ఆయన నాగచైతన్య ఒకటే అడిగేవారు. నువ్వు బయట ఎంత పెద్ద హీరోయిన్ అయినా కావచ్చు.

కానీ ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం నీ బాధ్యత.. నువ్వు బయట ఎంత పెద్ద స్టార్ అయిన ఇంట్లో ఒక మామూలు గృహిణివి మాత్రమే.. ఇంట్లో సరుకులు మాత్రమే కాదు వీకెండ్స్ ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా నువ్వే ప్లాన్ చేయాలి అంటూ నాగచైతన్య చెప్పేవాడట.ఒకరకంగా చూసుకుంటే నాగచైతన్య సమంతపై ఇంట్లో ఆధిపత్యం చెలాయించేవాడని అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ సమంతకి స్టార్డం వచ్చిన సమయంలో నాగచైతన్యకి అసలు ఇండస్ట్రీలో పేరే లేదు. సమంత స్టార్డం ని నాగచైతన్య ఓర్వలేదు కావచ్చు.అందుకే ఇంట్లోకి వచ్చాక భర్త అనే ఆధిపత్యం చెలాయించేవాడు అంటున్నారు.

 అయితే ఈ మాటలు సమంత చెప్పిన సమయంలో ఆమె నవ్వుకుంటూనే చెప్పింది. ఒక భర్త భార్యపై ఎలా అయితే ఆర్డర్స్ వేస్తాడో అలా అనేది నవ్వుతూనే చెప్పింది. కానీ విడాకుల తర్వాత మాత్రం అది కాస్త నెగటివ్గా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే మగవాడు ఆడదానిమీద ఆధిపత్యం చెలాయించాలి అని అన్నింటికీ నేనే పెద్ద నేనే గొప్ప అని ఉంటాడో అప్పుడే ఇద్దరి మధ్య ఇగో గొడవలు వచ్చి విడాకులు తీసుకునే ఆలోచన వస్తుంది అని ఈ విషయం తెలిసిన చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇగో అనేది ఎక్కువగా ఉంటుంది. అలా నాగచైతన్య సమంత విషయంలో కూడా జరిగింది కావచ్చు అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: