ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నామని ఫీడింగ్ కూడా తీసుకుంటున్నారని అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయంటూ తెలిపారు. కళ్ళు తెరుస్తున్నప్పుడు మనుషులను గుర్తుపట్టలేదని కిమ్స్ వైద్యలో తెలియజేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూడడానికి వెళ్లిన రేణుక అతని కుమారుడు సంధ్య థియేటర్ వద్ద జరిగా తొక్కిసలాటలో భాగంగా రేవతి మరణించగా ఇక ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
శ్రీ తేజకు ఇలా జరగడంతో అల్లు అర్జున్ శ్రీ తేజకు అన్ని చూసుకుంటానంటూ తెలియజేశారు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ నిర్మాత బన్నీ వాసు తదితరులు సైతం కిమ్స్ వైద్యులకు కలిసి శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిలను కూడా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ కొంటున్నారు అల్లు అర్జున్. మొత్తానికి శ్రీ తేజ ఆరోగ్యంగా కోలుకొని బయటికి వస్తే అల్లు అర్జున్ కి కొంతమేర ఊరట లభిస్తుంది.. ఒకవైపు రికార్డులతో పుష్ప 2 సినిమా దూసుకుపోతున్నప్పటికీ ఈ సంఘటన వల్ల అటు పుష్ప 2 చిత్ర బృందానికి కాస్త నిరాశ మిగులుతోంది.