తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి నటసింహం బాలకృష్ణకు అద్భుతమైన గుర్తింపు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ నటించిన సినిమాలలో చాలా సినిమాలు సంక్రాంతి పండుగకు వచ్చాయి. అలా వచ్చిన సినిమాలలో అనేక మూవీలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఇకపోతే 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమా విడుదల అయింది. ఈ మూవీ తో పాటు చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలో కూడా విడుదల అయ్యాయి.

ఇక ఈ ముగ్గురు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే సంక్రాంతి పండక్కి విడుదల కానుండడంతో ఈ ముగ్గురిలో ఎవరు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారు అనే ఉచ్చుకత ఆ సమయంలో ప్రేక్షకుల్లో భారీగా నెలకొంది. ఇక ఈ మూడు సినిమాలు 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి. అందులో మృగరాజు సినిమాకు ఫ్లాప్ టాక్ రాగా , దేవి పుత్రుడు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఇక నరసింహ నాయుడు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి మృగరాజు సినిమా పెద్ద మొత్తంలో కలెక్షన్లను వసూలు చేయలేక బాక్స్ ఆఫీస్ బోల్తా కొట్టింది. ఇక దేవీపుత్రుడు సినిమా పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లు వసూలు చేసి యావరేజ్ విజయాన్ని చేసుకుంది.

ఇక నరసింహ నాయుడు సినిమా ఏకంగా అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా 2001 వ సంవత్సరం సంక్రాంతి పండక్కి బాలకృష్ణ , చిరంజీవి , వెంకటేష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడగా అందులో బాలయ్య గెలుపొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: