టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చి అద్భుతమైన స్థాయికి చేరుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో , విలన్ పాత్రలలో నటించి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకొని స్టార్ హీరో స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా అదే స్టార్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించిన చిరంజీవి తన కెరియర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అలా వదులుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ లు కూడా ఆయన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే చిరంజీవిసినిమా కథను రిజెక్ట్ చేయగా దానిని తారక్ ఓకే చేయగా అది మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లు తెలుస్తుంది. అసలు ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రావాలా అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కి భారీ ఫ్లాప్ వచ్చింది. ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ ఈ మూవీ కథను తారక్ కోసం కాకుండా మెగాస్టార్ చిరంజీవి కోసం తయారు చేశాడట. అందులో భాగంగా చిరంజీవిని కలిసి ఈ మూవీ కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న చిరంజీవికి ఆ స్టోరీ నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశాడట. దానితో పూరి జగన్నాథ్ ఈ కథను తారక్ కి వినిపించగా ఆయనకు ఈ స్టోరీ నచ్చడంతో వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక చిరు రిజెక్ట్ చేసిన స్టోరీతో తారక్ కి ఫ్లాప్ వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: