బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటించిన బోతున్నారు. అలాగే ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీ డియల్ కూడా నటించబోతున్నారు. వీరితో పాటు మరొక యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తమన్ ఈ సినిమాకి మరొకసారి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. డాకు మహారాజు ప్రిరిలిజ్ ఈవెంట్ ని అమెరికాలో చాలా గ్రాండ్గా ప్లాన్ చేసినట్టు సమాచారం. జనవరి 4వ తేదీన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో టెక్సాస్ లో ఉండబోతున్నట్లు మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది.
దీంతో ఈవెంట్ అమెరికాలో ఉండడం చేత బాలయ్య అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఈవెంట్ కి వెళ్లే అభిమానులకు సైతం ప్రముఖ ఓటీటి సంస్థ ఆహా ఒక భారీ ఆఫర్ ను సైతం ప్రకటించింది. ఆహా గోల్డ్ ను ఈనెల 31లోగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి కచ్చితంగా వారికి డాకు మహారాజ్ ఈవెంట్ లాంచ్ లో కూర్చొని చూసే అవకాశాన్ని కల్పిస్తామంటూ విస్తృతమైన ఆలోచనతో ఆహా టీమ్ ముందుకు వచ్చింది. దీంతో ఆహా గోల్డ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డాకు మహారాజును కలుసుకోండి అంటూ ఆహా టీమ్ ఒక పోస్ట్ ని కూడా రిలీజ్ చేసింది. మరి ఎవరైనా బాలయ్యను కలవాలనుకుంటే ఇలా చేస్తే సరిపోతుంది.