ఐతే కుర్ర హీరోయిన్స్ ఎంతమంది వచ్చినా సరే తన క్రేజ్ తనదే అనేలా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న టబు యువ కథానాయికలకు ధీటుగా ఫోటో షూట్స్ తో మెప్పిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు స్లీవ్ లెస్ ఫోటో షూట్ తో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. గ్లామర్ షో చేయడంలో తన తర్వాతే ఎవరైనా అనిపించేలా ట్రీట్ అందిస్తుంది అమ్మడు.
ముఖ్యంగా లేటెస్ట్ గా చేసిన ఫోటో షూట్ లో బ్లాక్ స్లీవ్ లెస్ గౌనులో అందాలతో డిస్ట్రబ్ చేస్తుంది టబు. ఈ ఏజ్ లో కూడా ఇలా తన గ్లామర్ తో ఆడియన్స్ ని అలరించడం ఆమె ఒక్కదాని వల్లే సాధ్యమని చెప్పొచ్చు. ఈ ఏజ్ లో మిగతా హీరోయిన్స్ అసలు ఏమాత్రం గుర్తు పట్టలేనంతగా మారితే టబు మాత్రం ఇప్పటికీ గ్లామర్ క్వీన్ గానే కనిపిస్తుంది. ఇక సినిమాలు కూడా తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ వాడుకుంటుంది. ఈ ఇయర్ లో క్రూతో హిట్ అందుకున్న టబు ఔరన్ మై కహన్ దం థ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల గ్యాప్ లో ఇలా తన ఫ్యాన్స్ కోసం గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది టబు.